తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సోకిందని తెలిసి ఆస్పత్రి మెట్ల మీదే ప్రాణాలొదిలిన బాధితుడు - veepanagandla news

ఒంట్లో నలతగా ఉంది... కరోనా వచ్చిందేమోనని పరీక్షకు వెళ్లాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్​ అని తేలింది. ఫలితం చూసి పూర్తిగా నీరసపడిపోయిన ఆ బాధితుడు... ఆస్పత్రి మెట్లపైనే కూర్చుండి పోయాడు. అసలే అనారోగ్యంతో ఒంట్లో సత్తువ లేదు... దానికి తోడు కరోనా అని తేలటంతో మనోధైర్యం కోల్పోయిన నర్సింహా కూర్చున్నచోటే తుదిశ్వాస విడిచాడు.

corona positive person died at hospital premises after knowing result
corona positive person died at hospital premises after knowing result

By

Published : Apr 29, 2021, 4:52 PM IST

కరోనా సోకిందని తెలిసి ఆస్పత్రి మెట్ల మీదే ప్రాణాలొదిలిన బాధితుడు

వనపర్తి జిల్లా వీపనగండ్లలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ జరిగిన ఓ వ్యక్తి కూర్చున్నచోటే కుప్పకూలాడు. దగడపల్లికి చెందిన నర్సింహ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఉదయం వీపనగండ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలు చేయించుకోగా.. వైరస్‌ ఉందని నిర్ధరణ అయింది.

తనకు కొవిడ్‌ సోకిందనే బాధలో ఆస్పత్రి మెట్లపైనే కూర్చుండిపోయాడు. అసలే అస్వస్థత... ఆపై కరోనా వచ్చిందనే భయంతో... మనోధైర్యం కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే... కూర్చున్న చోటే తుదిశ్వాస విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్నవాళ్లను తీవ్రంగా కలచివేసింది. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిబంధనలు పూర్తిచేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చూడండి: ఏటీఎంలో డబ్బులు నింపుతున్నవారిపై దుండగుల కాల్పులు

ABOUT THE AUTHOR

...view details