వనపర్తి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఖిల్లా గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించారు. 5 రోజుల క్రితం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే ఏఎన్ఎంతో పాటు ఆమె భర్తకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనివల్ల వారి ప్రైమరీ కాంటాక్ట్స్ నుంచి అధికారులు శాంపిల్ తీసి పంపించారు. అందులో ఈరోజు ఏడు మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించారు.
వనపర్తిలో కరోనా అలజడి... ఒక్కరోజే 11 కేసులు - వనపర్తిలో కరోనా కేసులు
వనపర్తి జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన బాధితుల ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

వనపర్తిలో కరోనా అలజడి... ఒక్కరోజే 11 కేసులు
వనపర్తి పట్టణంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి ప్రైమరీ కాంటాక్ట్స్ వెతికే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. జిల్లాలో బుధవారం నమోదైన 11 కొత్త కేసులతో కలిపి కేసుల సంఖ్య 52కి చేరింది. ఇందులో ముగ్గురు డిశ్చార్జి కాగా, 47 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.