వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన శిరీష అనే బాలింత కరోనాతో మృతి చెందడంతో ఖననం చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకున్న వారు వినకుండా రహదారిపై బైఠాయించారు.
కరోనాతో మృతిచెందిన బాలింత ఖననాన్ని అడ్డుకున్న గ్రామస్తులు - కరోనా
వనపర్తి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కరోనాతో మరణించిన ఓ బాలింత మృతదేహాన్ని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకున్న గ్రామస్తులు వినకుండా రహదారిపై బైఠాయించారు.
హైదరబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో శిరీషకు శస్త్ర చికిత్స చేసి, చనిపోయిన మృత శిశువు బయటకు తీశారు.ఈనెల 28వ తేదీ సోమవారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. మరుసటి రోజు మృతదేహానికి శవ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె భర్త యాదగిరి మృతదేహాన్ని తన గ్రామంలోనే ఖననం చేసుకుంటానని గ్రామానికి తీసుకురాగా....గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకున్నా వారు వినకుండా రహదారిపై బైఠాయించారు. చివరికి తన పొలంలోనే ఖననం చేసుకుంటానని భర్త తీసుకువెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.