వనపర్తి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జిల్లా పరిధిలో తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసుల్లో వనపర్తి పట్టణంలో మూడు కేసులు, కొత్తకోటలో మూడు, పెద్దమందడి మండలం మద్దిగట్లలో ఒకటి, ఖిల్లా ఘనపురంలో రెండు కేసులు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - Wanaparthy News
వనపర్తి జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన బాధితుల ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

వనపర్తిలో పెరుగుతున్న కరోనా కేసులు
కొత్త కేసులతో వనపర్తి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 39కి చేరాయి. ఒకరు డిశ్చార్జి కాగా.. 36 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం నమోదైన కరోనా బాధితుల ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారిని హోమ్ క్వారంటైన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్