వనపర్తి జిల్లాలో పెద్దమందడిలో డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు గ్రామాల్లో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త వారికి ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థపై అవగాహన కల్పించారు.
డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు - dsp srujana
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.
డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు