తెలంగాణ

telangana

ETV Bharat / state

theft at lift Irrigation project: ఎత్తిపోతల పథకం వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్లారంటే..! - చిన్న మరూర్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ

theft at lift Irrigation project: వనపర్తి జిల్లా చిన్నమరూర్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ జరిగింది. మోటర్ల నుంచి కాపర్ వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు.

theft at lift Irrigation project
వనపర్తి జిల్లా చిన్నమరూర్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ

By

Published : Jan 3, 2022, 8:24 PM IST

theft at lift Irrigation project: వనపర్తి జిల్లాలోని ఎత్తిపోతల పథకం వద్ద చోరీ జరిగింది. చిన్నంబావి మండలం చిన్నమరూర్ సమీపంలోని ఈ ప్రాజెక్ట్‌ వద్ద మోటార్లకు ఉన్న కాపర్‌ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వాటి విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు.

copper wire theft: ఈ ఎత్తిపోతల పథకాన్ని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. 9 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందని రైతులు తెలిపారు. కాపర్ వైర్లు ఎత్తికెళ్లడంతో మోటార్లు పని చేయడం చేయక.. సాగు నీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని రైతులు వాపోయారు. గతంలో ఇలాగే 2 సార్లు మోటర్ల వైర్లు చోరీకి గురైనట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.8 లక్షల విలువ ఉంటుందని రైతులు తెలిపారు. చిన్నమరూర్ ఎత్తిపోతల పథకంలో పర్యవేక్షణ లోపం వల్లనే దొంగతనాలు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సరైన నిఘా ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.

కాపర్‌ వైర్లు దాదాపు మూడు నుంచి నాలుగు లక్ష రూపాయల విలువ చేస్తవి. కాంట్రాక్టర్‌కు ఇదివరకే సీసీ కెమెరాలు పెట్టమని చెప్పాం. దొంగతనం తెలిసిన వాళ్లే చేస్తున్నారు. పానెల్‌ బోర్డు, బోల్ట్‌లు తీసి వైర్లు ఎత్తుకెళ్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు కాపర్ వైరు ముంబయి నుంచి వచ్చేసరికి పంటలు మొత్తం ఎండిపోతాయి. దీని ద్వారా 9 వేల ఎకరాలకు నీళ్లు పారుతాయి. అందరూ కలిసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ మూడేళ్ల నుంచి పనులు చేయిస్తున్నారు. సీసీ కెమెరాలు పెడితే ఇలాంటివి జరగవు. కాంట్రాక్టర్‌ కూడా రైతుల సమస్యను పట్టించుకోవడం లేదు. మోటార్లు మొత్తం కాలిపోతున్నాయి. మంచి కంపెనీ మోటార్లు తెచ్చి ఫిట్‌ చేస్తే సమస్య ఉండదు. - తిరుమల్ రెడ్డి, రైతు

ABOUT THE AUTHOR

...view details