మహబూబ్నగర్- హైదరాబాద్- రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసినా ఓటమిపాలవుతారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేసీఆర్ పోటీ చేసినా ఓటమి తప్పదు: చిన్నారెడ్డి - Chinna reddy on cm kcr
వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మహబూబ్నగర్- హైదరాబాద్- రంగారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి నాలుగో స్థానంలో ఉండబోతుందని చిన్నారెడ్డి జోస్యం చెప్పారు.
కేసీఆర్.. పోటీ చేసినా ఓటమి తప్పదు: చిన్నారెడ్డి
డబ్బు, మందు పంపిణీ పట్టభద్రులపై పనిచేయవని.. ఒక్కో ఓటుకు రూ. 1,000 నుంచి 1,500 వరకు పంపిణీ చేస్తూ తెరాస ఓట్ల కొనుగోలు కార్యక్రమానికి ఒడిగట్టిందని చిన్నారెడ్డి ఆరోపించారు. ఎన్నడూ లేనివిధంగా పట్టభద్రులు ఎంతో ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని తెలిపారు. తెరాస అభ్యర్థి నాలుగో స్థానంలో ఉండబోతుందని చిన్నారెడ్డి జోస్యం చెప్పారు.
Last Updated : Mar 14, 2021, 1:38 PM IST