వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
వనపర్తి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ధర్నా - congress leaders protest at wanaparty
ఆర్టీసీ ఛార్జీల పెంపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

వనపర్తి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఛార్జీల పెంపుదలపై సర్కారు పునరాలోచించాలని కోరుతూ డీఆర్వోకు వినతిపత్రాన్ని అందజేశారు.
వనపర్తి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి