ఆధార్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ - telangana latest news
వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని పాలనాధికారి యాస్మిన్ బాషా ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ Collector Yasmin basha opened the Aadhaar Registration Center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11341972-308-11341972-1617967658199.jpg)
కలెక్టర్ యాస్మిన్ భాషా
నూతన ఆధార్ కార్డుల నమోదు, పేరులో మార్పులు, పుట్టిన తేదీ మార్పులు తదితర సమస్యలను ఆధార్ కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. నిర్వాహకులు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని సూచించారు.