తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపాలి' - Vanaparthi district latest news

వనపర్తి జిల్లా చిన్న మందడి గ్రామ రైతులతో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సమావేశం అయ్యారు. సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి చెప్పి కూరగాయల వైపు మొగ్గు చూపాలన్నారు. కూరగాయల సాగుకు ముందుకొచ్చిన వారికి మొక్కలు పంపిణీ చేశారు.

రైతులతో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సమావేశం
రైతులతో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సమావేశం

By

Published : Mar 17, 2021, 9:51 PM IST

రైతులు సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి చెప్పి కూరగాయల వైపు మొగ్గు చూపాలని వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. ఒకసారి కూరగాయలు సాగుచేసి చూస్తే ఆ పంటల వైపు వెళ్లరని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిలో అధిక దిగుబడులు సాధించవచ్చనని సూచించారు.

సహకారం అందిస్తాం..

పెద్దమందడి మండలం చిన్న మందడిలో ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగు చేసేందుకు ముందుకొచ్చిన 30 మందికి మొక్కలు పంపిణీ చేశారు. కూరగాయలు పండించే రైతులకు ఉద్యాన శాఖ నుంచి సహకారం అందిస్తామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెలకువలు, సలహాలు సూచిస్తారని పేర్కొన్నారు.

సంతోషం..

పెద్దమందడి మండలంలో కూరగాయల సాగుకు 100 మంది ముందుకు రావడం సంతోషం దాయకమని అభినందించారు. గ్రామంలోని నర్సరీలో మొక్కలు ఎండి పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకులతో తయారుచేసిన వర్మీ కంపోస్ట్​ను పరిశీలించారు.

ఇదీ చూడండి:పసుపు బోర్డు ఆశలపై కేంద్రం నీళ్లు... మళ్లీ ఉద్యమానికి రైతులు సిద్ధం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details