తెలంగాణ

telangana

ETV Bharat / state

CM wanaparthy tour: వనపర్తికి సీఎం.. "మన ఊరు - మన బడి"కి శ్రీకారం - వనపర్తి జిల్లా పర్యటనకు సీఎం

CM wanaparthy tour: సీఎం కేసీఆర్‌ మార్చి 8న వనపర్తి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నూతన కలెక్టరేట్ భవనం, 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.

CM wanaparthy tour
వనపర్తికి సీఎం.. "మన ఊరు - మన బడి"కి శ్రీకారం

By

Published : Feb 28, 2022, 10:21 PM IST

Updated : Jul 21, 2022, 2:27 PM IST

CM wanaparthy tour: వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. మార్చి 8వ తేదీన వనపర్తికి వెళ్లనున్న సీఎం అక్కడి నుంచే "మన ఊరు - మన బడి" కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనంతో పాటు కన్నెతండా లిఫ్టు, మార్కెట్‌ యార్డును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

వనపర్తికి సీఎం.. "మన ఊరు - మన బడి"కి శ్రీకారం

ఆ తర్వాత తెరాస పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వనపర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు "మన ఊరు - మన బడి" కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Jul 21, 2022, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details