తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Speech at Wanaparthy : 'తెలంగాణ కోసం గొంతెత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చుంది ఎవరో గుర్తు చేసుకోండి'

CM KCR Speech BRS Public Meeting at Wanaparthy : తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను తెలంగాణ కోసం తిరిగినప్పుడు కొందరు.. నేతల కాళ్ల దగ్గర కూర్చున్నారని.. వారు ఎవరో గుర్తుచేసుకోవాలన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు.

CM KCR Praja Ashirwada Sabha
CM KCR Praja Ashirwada Sabha at Wanaparthy

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 5:36 PM IST

Updated : Oct 27, 2023, 7:03 AM IST

CM KCR Speech at Wanaparthy తెలంగాణ కోసం గొంతెత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చుంది ఎవరో గుర్తు చేసుకోండి

CM KCR Speech BRS Public Meeting at Wanaparthy : తెలంగాణ ఏర్పడ్డాక ఈ పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్​ కోరారు. కొడంగల్​కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు తనకు సవాల్​ విసురడంపై స్పందించారు. ఈ విమర్శలకు విపక్షాలకు ఒకటే సమాధానం.. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్​లు ఉన్నారు.. వాళ్లతో తలపడాలని సున్నితంగా చెప్పారు. ఆనాడు తెలంగాణ కోసం తిరిగినప్పుడు కొందరు నేతల బూట్ల వద్ద కూర్చున్నారని.. వారు రాకున్నా... పిడికెడు మందిని పట్టుకుని పోరాడి తెలంగాణ సాధించానని కేసీఆర్​ గుర్తు చేశారు.

'ముస్లింలను కాంగ్రెస్​ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోంది. తెలంగాణ గురుకులాల్లో నేడు వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారు. మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాము. రైతులకు ఏ ప్రభుత్వమైనా.. డబ్బులు ఎదురిచ్చిందా?. ఎన్ని మోటార్లు పెట్టారని నేడు రైతును ఎవరైనా అడుగుతున్నారా?. రైతులు కట్టాల్సిన రూ.లక్షల కోట్ల కరెంటు బిల్లులను ప్రభుత్వమే కడుతోంది. రైతుల భూమిపై రైతులకే అధికారం కట్టబెట్టాం. రైతులపై వీఆర్​వో, ఆర్​ఐ, ఎమ్మార్వో పెత్తనం లేకుండా చేశాము. ధరణి వల్లే భూతగాదాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రైతుబంధు, దళిత బంధు(Dalit Bandhu)ను పుట్టించిందే కేసీఆర్​. ఈ రెండు పథకాల ఆలోచనలు గతంలో ఎవరికైనా వచ్చిందా?. వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని' బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు.

"వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడు ఎవడు? ఎవరి కావాలో తేల్చాసింది మీరు. కాంగ్రెస్​ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా ఆపే ప్రయత్నం చేస్తుందో చూశారు. ఒక్క మెడికల్​ కాలేజీని అయిన మహబూబ్​నగర్​కు తీసుకువచ్చారా.. రైతుల భూములపై మొత్తం అధికారాన్ని వారికే ఇచ్చాము. అటువంటి ధరణిని తీసేస్తామని కాంగ్రెస్​ పార్టీ ఊరకనే మాట్లాడుతుంది. దళితబంధు అనే పథకాన్ని సృష్టించిందే కేసీఆర్​. ఈసారి కచ్చితంగా వాల్మీకి హక్కుల కోసం పోరాడతాం."- కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు

CM KCR Praja Ashirwada Sabha at Wanaparthy : తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలని వనపర్తి ప్రజలను సీఎం కేసీఆర్​ కోరారు. వనపర్తి ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉండేందని.. గత పదేళ్లలో ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూశారు కదానని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే.. జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు ఏ కాంగ్రెస్​ నేత అయినా.. మెడికల్​ కాలేజీ తెచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో బీఆర్​ఎస్​ ఐదు మెడికల్​ కాలేజీలను తీసుకువచ్చిందని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు.

CM KCR Praja Ashirvada Sabha at Achampet : 'కేసీఆర్​ దమ్ము ఏంటో దేశమంతా చూసింది.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు'

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : 'కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది'

Last Updated : Oct 27, 2023, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details