తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr Today News: సీఎం కేసీఆర్ గద్వాల టూర్... మధ్యలో రైతులతో మాటామంతీ - Cm kcr today news

ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్​కు బయల్దేరి... మార్గమధ్యలో రైతులతో ముచ్చటించారు.

Cm Kcr Today News
Cm Kcr Today News

By

Published : Dec 2, 2021, 8:49 PM IST

Cm Kcr Gadwal Tour: రైతులు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయన ఇవాళ పర్యటించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడం వల్ల ఆయనను ముఖ్యమంత్రి పరామర్శించారు. వెంకటరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే నివాసంలో సీఎం

పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో వనపర్తి జిల్లా రంగాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న పంట పొలాల్లో వేసిన మినుము, వేరుశనగ పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్​లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

రైతులతో ముచ్చటిస్తున్న కేసీఆర్

ఇతర పంటలపై దృష్టి...

Cm kcr on Paddy: వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే ఇతర పంటల సాగు మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని సీఎం పేర్కొన్నారు. వనపర్తి జిల్లా రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ దగ్గర ఆగిన సీఎం కేసీఆర్ రోడ్డు నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లి మహేశ్వర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు.

Cm Kcr Today News

దిగుబడి ఎంతొస్తుంది..?

Cm Kcr Met Farmers: మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్లో ధర ఎంత ఉంది? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి? అని రైతులను సీఎం కేసీఆర్ వివరాలు అడిగారు. మినుములు ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని... ఎంఎస్​పీ ధర క్వింటాల్​కు రూ. 6,300 ఉండగా... మార్కెట్​లో ధర రూ. 8 వేలకుపైనే ఉందని రైతులు వివరించారు. వేరుశనగ 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని... ఎంఎస్​పీ క్వింటాల్ ధర రూ. 5,550 ఉండగా... మార్కెట్​లో రూ. 7 వేలకు పైనే ఉందని సీఎంకు వివరించారు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి దిగుబడి బాగా వస్తుందని తెలిపారు.

పంటను పరిశీలించిన కేసీఆర్...

Cm Kcr Gadwal Tour: ఆ తర్వాత కొత్తకోట మండలం విలియం కొండ తండా రోడ్డు వద్ద కళ్లంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. రైతు గోకరి వెంకటయ్య.. వేరుశనగ పంట దగ్గరికి వెళ్లి పరిశీలించారు. సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ చెట్లను భూమి నుంచి తీసి వేరుశనగ కాయలను స్వయంగా పరిశీలించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడం వల్ల పంటల దిగుబడి బాగా పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడం వల్ల రైతులు, గిరిజనులు సీఎంతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.

మార్కెట్​లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.

ఎన్ని ఎకరాలు వేశావు?

Cm Kcr Today News: రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకునే అవగాహన కల్పించాలని.. మంత్రులు, కలెక్టర్​కు సీఎం సూచించారు. మినుము పంట ఎన్ని ఎకరాలు వేశావని ముఖ్యమంత్రి ప్రశ్నించగా... ఐదెకరాలు మినుము పంట వేసినట్టు రైతు మహేశ్వరరెడ్డి తెలిపారు. టీ9 రకం మినుము పంట సాగు చేశానని క్వింటాల్​కు 8 నుంచి 12 వేల వరకు ఉంటుందని 90 రోజులలో పంట కాపు వస్తుందని సీఎంకు వివరించారు. పంట మార్పిడి వల్ల దిగుబడి బాగా వస్తుందా అని ముఖ్యమంత్రి అడగగా... దాదాపు 25 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు వివరించారు.

వేరుశనగ క్వింటాల్​కు ఎంత ఉందని రైతును ముఖ్యమంత్రి ప్రశ్నించగా... ఏడు నుంచి ఎనిమిది వేల వరకు మద్దతు ధర ఉందని రైతు రాములు సీఎంకు వివరించారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి సూచించారు. విలియం కొండ దగ్గర రైతులు సాగుచేసిన వేరుశనగ పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

ఇదీ చూడండి: cm kcr met farmers: వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్​... ఆశ్చర్యపోయిన రైతులు.. ఆ తర్వాత..

ABOUT THE AUTHOR

...view details