వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్, పల్లె ప్రగతి రాష్ట్ర పర్యవేక్షకుడు సత్యనారాయణ రెడ్డి పర్యటించారు. కంబాలపురంలోని నర్సరీ, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ స్థలాలను పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వనపర్తిలో పర్యటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ - వనపర్తిలో పర్యటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. పరిశుభ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
![వనపర్తిలో పర్యటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ CIVIL SUPPLY COMMISSIONER VISIT WANAPRTHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6359385-thumbnail-3x2-llll.jpg)
పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన సత్యనారాయణ... గ్రామస్థుల నుంచి పలు రకాల సమస్యలపై ఫిర్యాదులు అందుకున్నారు. అక్కడే ఉన్న అధికారులకు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. మొదటగా పెబ్బేరులో ఉన్న ప్రియదర్శిని వసతి గృహానికి చేరుకుని అక్కడి నుంచి మళ్లీ అక్కడి నుంచి తన పర్యటన కొనసాగించారు
గ్రామాలలో పల్లెప్రగతి కార్యక్రమంలో డంపిగ్ యార్డులు, స్మశాన వాటికలు, చెత్త వేరు చేసే కేంద్రాలు, ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలని అధికారులకు సత్యనారాయణరెడ్డి సూచించారు.