వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
చౌడేశ్వరీ దేవి జాతర సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు - వనపర్తి జిల్లా వార్తలు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చౌడేశ్వరీ దేవి జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంతరాష్ట్ర బండలాగుడు పోటీలను ప్రారంభించారు.

చౌడేశ్వరీ దేవి జాతర సందర్భంగా అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు
కర్ణాటకతోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వృషభాలు తరలివచ్చాయి. పోటీలను చూడడానికి జనాలు ఎగబడ్డారు. సందడి వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మీడియా మిత్రులకు మానసిక ఉల్లాసం : శ్రీనివాస్ గౌడ్