తెలంగాణ

telangana

ETV Bharat / state

'వర్షపు నీటిని ఒడిసి పట్టాలి'

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో జల సంరక్షణ అభియాన్​లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డాలీ చక్రవర్తి పర్యటించారు. గోపాల్​పేటలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్​ శ్వేతా మహంతి పాల్గొన్నారు.

By

Published : Jul 7, 2019, 11:07 AM IST

జల సంరక్షణ అభియాన్​లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి పర్యటన

జలసంరక్షణ అభియాన్​లో భాగంగా వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డాలీ చక్రవర్తి పర్యటించారు. నీటిపారుదల శాఖ తరపున నిర్మించిన ఊట కుంటలను, వాలు కట్టలను, చెరువులను ఆమె పరిశీలించారు. వర్షపునీటిని వృథా పోనివ్వకూడదని డాలీ చక్రవర్తి సూచించారు. అనంతరం గోపాల్​పేటలో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపట్టాల్సిన నిర్మాణాలకు ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.

జల సంరక్షణ అభియాన్​లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details