తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర పథకాలను విస్తృతంగా తీసుకెళ్లండి... అన్నీ మనమే గెలుస్తాం' - bjp-laxman-on-elections

వనపర్తి జిల్లా కొత్తకోట పుర పరిధిలోని భాజపా అభ్యర్థులు, కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఇంటింటికీ తిరిగి కేంద్ర పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని ఆయన కోరారు.

భాజపా గెలవకుంటే ఉమ్మడి పాలమూరు మరో భైంసా అవుతుంది : లక్ష్మణ్
భాజపా గెలవకుంటే ఉమ్మడి పాలమూరు మరో భైంసా అవుతుంది : లక్ష్మణ్

By

Published : Jan 18, 2020, 3:45 PM IST

ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాల గురించి, మున్సిపాలిటీలకు కేంద్రం అందిస్తున్న నిధులపై ప్రజలకు వివరించాలని భాజపా అభ్యర్థులకు, శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికంగా ఉండే పురపాలికల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆరేళ్లు గడిపేశారని దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, నిరుద్యోగ భృతి పథకాల హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

'మరో భైంసా కాకూడదంటే... భాజపానే గెలిపించండి'

ఎన్నికలను డబ్బుతో గెలవాలని తెరాస యత్నిస్తోందని, ప్రజలు గులాబీ పార్టీతో విసిగివేసారి పోయారని... ఇప్పుడు వారు మార్పు కోరుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. పుర ఎన్నికల్లో కాషాయ దళం మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెరాస గెలిస్తే లాభ పడేది మజ్లిస్ పార్టీనే అని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరో భైంసా కాకూడదంటే కాషాయ జెండా ఎగిరేలా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భాజపా గెలవకుంటే ఉమ్మడి పాలమూరు మరో భైంసా అవుతుంది : లక్ష్మణ్

ఇవీ చూడండి : బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details