తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పడింది' - స్వయంచాలిత నీటి ఆనకట్టకు గండి

స్వయంచాలిత నీటి ఆనకట్టగా 'సరళాసాగర్ జలాశయం' ప్రపంచంలోనే రెండోదిగా, ఆసియాలోనే మొదటిదిగా పేరుగాంచింది. ఇంతటి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న ఈ ఆనకట్ట ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైందంటున్నారు అక్కడి స్థానికులు. జలాశయాన్ని పట్టించుకోకపోవడం వల్లే గండి పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

break to sarala sagar project
'అధికారుల నిర్లక్ష్యం వల్లనే గండి పడింది'

By

Published : Dec 31, 2019, 9:49 AM IST

విజ్ఞాన, విహార యాత్రలు చేసేవాళ్లు సందర్శించేందుకు వీలుగా... యోగ్యమైన పర్యటక కేంద్రంగా కళకళలాడిన సరళాసాగర్ సాగునీటి ప్రాజెక్టు ఇప్పుడు గండి పడికన్నీరు పెడుతోంది. ఆసియాలోనే ఆటోమాటిక్ సైఫన్ వ్యవస్థతో నడిచే ఏకైక ప్రాజెక్టుగా నిలిచిన జలాశయం గండి పడి రైతులకు, మత్స్యకారులకు ఆవేదన మిగిల్చింది.

అధికారులు నిర్లక్ష్యం వల్లే గండి పడిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ విపత్తు జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద నీరు మదనాపురం-ఆత్మకూరు ప్రధాన రహదారిపైకి చేరడంతో మదనాపురం-ఆత్మకూరు రోడ్డులోని వంతెనపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పడింది'

ఇదీ చూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి... వృథాగా పోతున్న నీరు

ABOUT THE AUTHOR

...view details