వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో ఉన్న ఏబీడీ మద్యం తయారీ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా... చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
మద్యం తయారీ కంపెనీలో ప్రమాదం... నలుగురికి తీవ్ర గాయాలు - abd liquor factory
పని చేసే క్రమంలో అనుకోకుండా బాయిలర్ పేలి నలుగురికి గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్లోని ఏబీడీ మద్యం తయారీ కంపెనీలో జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా... హైదరాబాద్కు తరలించారు.
boiler blast in liquor factory and four injuries
గాయపడిన వారిలో సూర్యాపేటకు చెందిన నరసింహారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి చెందిన వినయ్ కుమార్ రెడ్డి, తమిళనాడుకు చెందిన షణ్ముఖ, కర్ణాటకకు చెందిన కృష్ణమూర్తి ఉన్నారు. పని చేసే క్రమంలో అనుకోకుండా బాయిలర్ పేలి ప్రమాదం సంభవించింది. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.