'గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం' - BJP DK ARUNA GANDHI SANKALPA YATRA in Kothakota
వనపర్తి జిల్లా కొత్తకోటలో భాజపా ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర ప్రారంభించారు. మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
'గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం'
గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే గాంధీ నినాదాన్ని అనుసరించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి ప్రతి పార్లమెంట్ పరిధిలో 150 కిలోమీటర్ల మేర సంకల్పయాత్రను మొదలుపెట్టారు. ఇవాళ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నిర్వహించిన యాత్రలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీధుల గుండా తిరుగుతూ గాంధీజీ ఆశయాలు అయినా స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని డీకే అరుణ వెల్లడించారు.