వనపర్తి జిల్లాలో భారత్ బంద్ మద్దతుగా ఆర్టీసీ డిపో ముందు తెరాస, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే వనపర్తి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించిన నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
వనపర్తి జిల్లాలో భారత్ బంద్.. కాంగ్రెస్, వామపక్షాలు, తెరాస ధర్నా...
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు మద్దతుగా వనపర్తి జిల్లాలో ఆందోళనలు చేస్తున్నారు. స్థానిక ఆర్టీసీ డిపో ముందు తెరాస, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు.
వనపర్తి జిల్లాలో భారత్ బంద్
డిపోలో ఉన్న 110 బస్సు సర్వీసులు డిపోకే పరిమితమయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రాథమిక హక్కుపైనా ఉక్కుపాదం?