తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీ కులస్థులు ఏకం కావాలి: తల్లోజు ఆచారి

బీసీ కులస్థులు ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని బీసీ కమిషన్​ జాతీయ సభ్యులు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుండాలంటే ఏకం కావాలని సూచించారు.

Talloju Achari participated in a programme in wanaparthi
కొత్తకోటలో బీసీల సమస్యల సాధన సమావేశం

By

Published : Mar 28, 2021, 7:04 PM IST

వెనుకబడిన తరగతుల అభివృద్ధి జరగాలంటే బీసీ కులాలు ఐకమత్యంగా ముందుకు రావాలని బీసీ కమిషన్ జాతీయ సభ్యులు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో నిర్వహించిన బీసీల సమస్యల సాధన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేశంలో 55 శాతం బీసీలు ఉన్నారన్న ఆచారి.. రాజ్యాధికారంలో మాత్రం వెనకబడ్డారని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుండాలంటే బీసీ కులస్థులు ఏకం కావాలని సూచించారు. అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కులవృత్తులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: మరో రెండురోజుల్లో ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

ABOUT THE AUTHOR

...view details