Bandi Sanjay Comments On BRS And Congress : వనపర్తిలో జిల్లా మక్తల్లో రాబోయే ఎన్నికల్లో.. బీజేపీ గెలుస్తుందనే సర్వేలన్నీ చెబుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో.. పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఆత్మకూరులోని మక్తల్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో.. తెలంగాణ బీజేపీ 119 బహిరంగ సభలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ బహిరంగ సభలో బండి సంజయ్ .. కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. తెలంగాణకు 2.40 లక్షల ఇళ్లను మంజూరు చేసే.. మక్కల్లో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అని బండి సంజయ్ అక్కడి ప్రజలను అడిగారు. ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. నేడు ఎవరికైనా ఇచ్చిందానని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చెప్పాలని సభావేదికపై ధ్వజమెత్తారు.
Bandi Sanjay Fire On CM KCR : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10,000 ఇస్తానని ఆనాడు సీఎం కేసీఆర్ మూడు జిల్లాల పర్యటన చెప్పారు కదా.. నేడు ఆ పరిహారాన్ని ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ చేస్తానని చెప్పిన సీఎం.. ఇప్పటివరకు ఎందుకు ఆ పని చేయలేదన్నారు. ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి.. రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నేరవేర్చారని.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చూపించాలని సవాల్ విసిరారు.