వనపర్తి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ 20 రోజుల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల హైదరాబాద్‌కి మకాం మార్చారు. ఇంటికి రమ్మని ఇరుకుటుంబాల సభ్యులు ఫోన్ చేయడంతో ఊరెళ్లారు. పెద్దలు పంచాయితీ పెట్టించి మాట్లాడుతుండగా... ఇరు కుటుంబ సభ్యులకు వాగ్వాదం చెలరేగింది. కళ్యాణ్‌పై అమ్మాయి పెద్ద నాన్న కొడుకు రవి కత్తితో దాడి చేశాడు. గొంతు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాధితుడిని వనపర్తి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 17 కుట్లు వేసి అబ్జర్వేషన్లో ఉంచారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి - వనపర్తిలో చెల్లిని ప్రేమించాడని గొంతు కోశాడు
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు వారిపై పగబట్టారు. ఊరికి రమ్మని పిలిచి అబ్బాయి గొంతు కోశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కత్తితో దాడి
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళ్యాణ్‌పై దాడికి పాల్పడ్డ రవి పరారీలో ఉన్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!
Last Updated : Nov 15, 2019, 2:19 PM IST