Attack on JC: వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే 'ప్రజావాణి' సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన శివకుమార్ అనే వికలాంగుడు ప్రజావాణికి హాజరయ్యాడు. తనకు వచ్చే వికలాంగ పింఛన్ మధ్యలో ఆగిపోయిందని.. తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ గత మూడు, నాలుగు ప్రజావాణి కార్యక్రమాలకు హాజరవుతున్నాడు.
అధికారులకు పలుమార్లు తన సమస్యను విన్నవించుకున్నా.. పరిష్కారం కావడం లేదని, తనకు వచ్చే పింఛన్ డబ్బులు ఆగిపోవడంతో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోయాడు. ఈ క్రమంలోనే ఇంకెన్నాళ్లు తన సమస్య పరిష్కారం కాదంటూ జేసీతో వాగ్వాదానికి దిగాడు. అంతలోనే జేసీపై చేయి చేసుకున్నాడు. గమనించిన పోలీసులు.. వెంటనే శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని బహిష్కరించారు.