కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న హోటల్ యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కమిషనర్ రమేశ్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ సంఘటన వెలుగుచూసింది. పట్టణ కేంద్రంలోని దాబాలు, హోటళ్లలో పురపాలక సిబ్బందితో కలిసి ఆయన సోదాలు నిర్వహించారు.
కుళ్లిన మాంసం, చేపలు.. హోటల్ యజమానికి రూ.10 వేలు ఫైన్ - తనిఖీల్లో పట్టుబడిన కుళ్లిన మాంసం
ఆదాయం కోసం హోటల్ నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన మాంసం, చేపలతో ఆహారం తయారు చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో పురపాలిక కమిషనర్ ఆకస్మిక తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. దీంతో ఆ హోటల్ నిర్వాహకునికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు
ఆత్మకూరులోని ఓ హోటల్ తనిఖీల్లో కుళ్లిన మాంసం
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అందరికీ నోటీసులు జారీ చేశారు. మాంసం విక్రయదారులు మార్కెట్లో ఆరోగ్యంగా ఉన్న జీవాలను మాత్రమే వధించాలని హెచ్చరించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తూనికల విషయంలో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించాలని రమేశ్ సూచించారు.