తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్​.. 29 బైకులు స్వాధీనం - వనపర్తి నేర వార్తలు

వనపర్తి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులు తమదైన స్టైల్​లో విచారించగా.. తీగ లాగితే డొంక కదిలినట్టు అసలు నిజాలు బయటపెట్టారు. బైకులను దొంగలించి అమ్ముతామని ఒప్పుకున్నారు. వారి నుంచి మొత్తం 29 బైకులను స్వాధీనపర్చుకున్నట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.

Arrest of bike thieves  and 29 bikes seized
ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్​.. 29 బైకులు స్వాధీనం

By

Published : Dec 26, 2020, 5:59 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న దొంగలను వనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్​లో మీడియా సమావేశంలో డీఎస్పీ కిరణ్ కుమార్ వివరాలు తెలిపారు.

ఎస్సై వెంకటేశ్​ విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అప్పుడు చీర్ల ఈశ్వర్, చీర్ల కృష్ణయ్యలను తమ వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించమని అడిగారు. పొంతనలేని సమాధానలు చెప్పడంతో వారిని స్టేషన్​కు తరలించి విచారించగా అసలు విషయం బయటపడింది. తాము బైకులను దొంగలించి అమ్ముతామని ఒప్పుకున్నారు. ఈ చోరీలలో సహాయపడిన వారి వివరాలు సేకరించి వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దర్యాప్తులో సీఐ సూర్యనాయక్, టౌన్ ఎస్సై వెంకటేశ్​ గౌడ్, గోపాల్​పేట ఎస్సై రామన్న గౌడ్ రెండు బృందాలుగా ఏర్పడి వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాల నుంచి మొత్తం 29 బైకులను పోలీసులు స్వాధీనపర్చుకున్నట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

ABOUT THE AUTHOR

...view details