జూరాల ప్రాజెక్ట్ గేట్ల దగ్గర మరో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ప్రమాదంలో గల్లంతైన పాప కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ఈనెల 17న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల నుంచి కురువపురం వెళ్తున్న పుట్టి కృష్ణా నదిలో పంచదేవుపాడు వద్ద మునిగింది. ఆ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు.
పుట్టి మునిగిన ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం - నారాయణపేట జిల్లా కురువపురం తాజా వార్తలు
జూరాల జలాశయంలో బుధవారం రెండు మృతదేహాలు.. తాజాగా గురువారం మరో మృతదేహం లభ్యమైంది. ఇంకో పాప కోసం వెతుకుతున్నారు. ఈనెల 17న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల నుంచి కురువపురం వెళ్తున్న పుట్టి పంచదేవుపాడు వద్ద కృష్ణా నదిలో మునిగింది. ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు.
పుట్టి మునిగిన ప్రమాదంలో మరొకరు లభ్యం
బుధవారం రెండు మృతదేహాలు దొరికాయి. ఇవాళ మరొకరి లభించింది. ఇంకా దొరకని చిన్న పాప కోసం వెతుకుతున్నారు. జలాశయంలో నీటి ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా గాలింపు చర్యలకు కష్టమవుతోంది.
ఇదీ చూడండి :తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి