పౌరులంతా అంబేడ్కర్ ఆశయాల సాధనకై కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. వనపర్తి కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.
'అంబేడ్కర్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి' - wanaparthy news
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ 130వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి యాస్మిన్ బాషా... అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ambedkar birth anniversary
అనంతరం వనపర్తి అంబేద్కర్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశించిన అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే ఆయన ఆశయాలు సాధించినట్లు అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచ తీర్థాలుగా చేశాం: కిషన్ రెడ్డి