వనపర్తి మార్కెట్ యార్డు, చిట్యాల, అమడ బాకుల కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు, తరలింపు, గన్నీ సంచులు, కేంద్రాల్లో కనీస వసతులు, అకాల వర్షాలు తదితర అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు.
కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. డిమాండ్ మేరకే ధాన్యం తరలింపు కోసం లారీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 66వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు..