ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన తరవాతే పెద్దమందడి మండలానికి వచ్చానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఆయన పర్యటించారు. వీరాయ పల్లిలో ఏర్పాటు చేసిన మహార్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా గోపాల సముద్రాన్ని కృష్ణా జలాలతో నింపిన తర్వాతే వెల్టూరుకు వస్తానని మాటిచ్చానని... దాని ప్రకారమే కృష్ణా జలాలతో గ్రామ చెరువు నిండిన తర్వాతే వచ్చానని మంత్రి అన్నారు. గోపాల సముద్రం చెరువు కృష్ణా జలాలతో నిండి అలుగు పడుతుండడంతో మంత్రి గంగమ్మ పూజలు చేశారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో సాగునీటికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరందించేందుకు కృషిచేస్తామన్నారు.
'ఎన్నికల హామీ నెరవేర్చిన తర్వాతే గ్రామానికొచ్చా' - వనపర్తి జిల్లాలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో పర్యటించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు అందించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
'ఎన్నికల హామీ నెరవేర్చిన తర్వాతే గ్రామానికొచ్చా'