ప్రజలందరూ కుల, మతాలకతీతంగా ఐకమత్యంతో మెలగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఇతరుల విశ్వాసాలను గౌరవించాలని తెలిపారు. వనపర్తి జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రం నుంచి జగద్గిరిగుట్ట, కొల్లాపూర్‌కు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఐదోవార్డులో పర్యటించి.. చర్చిలో కేక్‌కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలి : నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో నుంచి పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఐదో వార్డులో చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరూ ఐకమత్యంతో మెలగాలి: నిరంజన్ రెడ్డి
సమాజానికి మంచి పౌరులను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంఛార్జి జిల్లా మైనారిటీ శాఖ అధికారి అనిల్‌కుమార్, మున్సిపల్ ఛైర్మెన్ గట్టుయాదవ్, పుర కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.