వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరంలో ఆలుగడ్డ సాగు చేశారు. పొలంలో పండించిన ఆలుగడ్డ సాగు తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని దిగుబడి బాగా వచ్చిందన్నారు. పెట్టుబడి కూడా చాలా తక్కువని చెప్పారు. ఆలు సాగు ఏడాది పొడవునా ఉంటుందని క్వింటాలు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతుందని.. ఒక్కోసారి రెండు వేల దాకా కూడా పడే అవకాశం ఉందని వివరించారు.
ఆలుగడ్డ సాగుతో లాభాలు: నిరంజన్ రెడ్డి
ఆలుగడ్డ సాగులో లాభాలు అధికంగా ఉన్నాయని.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరంలో ఆలుగడ్డ సాగు చేశారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఆలు సాగు చేయకపోవటంతో ఉత్తరాది రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. రైతులు ఆలుగడ్డ సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎకరానికి రూ.45 వేల దాకా ఖర్చు అవుతుందని 85 నుంచి 90 రోజుల్లో పంట కోతకు వస్తుందని చెప్పారు. పెట్టుబడి పోను ఎకరాకు లక్ష రూపాయలు మిగిలే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మన నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉంటాయని.. దేశంలో ఎక్కువగా తినే కూరగాయల్లో ఆలు ఒకటన్నారు.
ఇదీ చదవండి: వనదుర్గ భవాని ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి హరీశ్ సమీక్ష