రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మానసపుత్రికగా అభివర్ణించారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వబోమని పునరుద్ఘాటించారు. కరోనా సంక్షోభంలోనూ సకాలంలో పెట్టుబడి సాయం అందించామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాస సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
త్వరలోనే వ్యవసాయ క్లస్టర్ల పునర్విభజన పూర్తిచేస్తాం : నిరంజన్‌రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ వార్తలు
కరోనా సంక్షోభంలోనూ రైతుబంధు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో క్లస్టర్ల పునర్విభజన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

niranjan reddy
ఇనాం భూముల సమస్యను యజమానులే పరిష్కరించుకోవాలని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో క్లస్టర్ల పునర్విభజన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత 2,600 క్లస్టర్లకు అదనంగా 200 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలోనే వ్యవసాయ క్లస్టర్ల పునర్విభజన పూర్తిచేస్తాం : నిరంజన్‌రెడ్డి
ఇదీ చదవండి:అసెంబ్లీ, మండలి నిర్వహణపై పోచారం, గుత్తా ప్రత్యేక సమావేశం