గ్రామ పంచాయతీల బలోపేతం కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. పెద్దమందడి మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు మంత్రి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలోని చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు వీటిని ఉపయోగించాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి - Ag minister niranjan reddy updates
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
![ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5310934-thumbnail-3x2-df.jpg)
ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి