వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద జాతీయ రహదారి వద్ద లారీ దగ్ధమైంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి హైదరాబాద్ వైపు ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ కనిమెట్ట వద్దకు రాగానే డీజిల్ ట్యాంక్ విరిగిపోయి కిందపడింది. ఫలితంగా నిప్పు రవ్వలు చెలరేగి మంటలు ట్రక్కుకు అంటుకున్నాయి.
ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంక్లో మంటలు.. లారీ దగ్ధం డ్రైవర్ అప్రమత్తత...
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ప్రమాదంలో లారీ పూర్తిగా కాలిపోయింది. అయ్యప్ప ఆలయం వద్ద ఉన్న యువకులు పైపుల ద్వారా నీటిని తీసుకొచ్చి మంటలను అర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి : కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం