వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన 8మంది మహిళలు శ్రీ విఘ్నేశ్వర హోమ్ పుడ్స్ పేరిట ఇంటి వంటకాల్ని ఆర్డర్లపై తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇరుగుపొరుగుకు చెందిన 8మంది మహిళలు … ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలకు అన్నదానం సహా భక్తుల కోసం రకరకాల వంటకాల్ని చేసి పెట్టేవాళ్లు . 11 రోజుల పాటు అంతా కలిసి ఉత్సవాల కోసం పనిచేసే వాళ్లు. ఆ పనేదో రోజూ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వారిలో మెరిసింది. అనుకున్నదే తడవుగా వాళ్లంతా కలిసి ఏఏ వంటకాలు చేయగలరో నమూనాలు చేసి వాట్సప్ గ్రూపుల్లో పంచుకున్నారు. ఆర్డర్లపై ఆ వంటకాలు చేస్తామని ప్రచారం చేశారు. గ్రూపుల్లో ఇలా పంచుకున్నారో లేదో ఆలా అర్డర్లు వచ్చిపడ్డాయి.
మేం అప్పట్లో వినాయకుని ప్రసాదాలు చేసేవాళ్లం. అయితే అలా ఆలోచన పుట్టింది. అందరం కలిసి చేస్తున్నాం. మూడు, నాలుగు నెలలుగా చేస్తున్నాం. వాట్సాప్‌లో పెట్టేవాళ్లం. పెట్టగానే అర్డర్స్ వచ్చాయి. అందుకే సక్సెస్ అయింది. మా దగ్గర అన్ని రకాల వంటకాలు దొరుకుతాయి. కొంతమందికి చేసుకునే ఓపిక ఉండదు. అలాంటి వారికి ఇవి ఉపయోగపడుతాయి. శుభకార్యాలకు, హాస్టల్స్‌కు, ఈవెంట్లకు అన్నింటి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాన్ వెజ్ కూడా వండుతాం. మేం ఎనిమిది మందిమి ఉన్నాం. రెగ్యూలర్‌గా 10 ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఒక్కోక్కరికి 10 వేల దాకా ఆదాయం వస్తుంది. - మహిళలు