తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం తాగొద్దని మందలించినందుకు యువకుడు ఆత్మహత్య - crime news

15 రోజులుగా మద్యం తాగి రావటం... వచ్చి తండ్రితో గొడవపడటం... ఇది భరించలేక తల్లీతండ్రి మందలించి... రాత్రిపూట బంధువుల ఇంటికి వెళ్లారు. తెల్లారి వచ్చి చూసేసరికి విగతజీవిగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన వనపర్తి పట్టణంలో చోటుచేసుకుంది.

a man suicide in wanaparthy
a man suicide in wanaparthy

By

Published : Jul 22, 2020, 4:03 PM IST

మద్యం తాగొద్దని తండ్రి మందలించినందుకు ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి పట్టణానికి చెందిన వంశీతేజ 15 రోజులుగా మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. తండ్రి లక్ష్మీనారాయణతో గొడవపడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి రాగా... భయపడిన లక్ష్మీనారాయణ తన భార్యతో కలిసి పట్టణంలోని శంకర్‌గంజ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వచ్చి చూడగా... వంశీతేజ ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే బంధువులు, చుట్టు పక్కల వారికి సమాచారం ఇవ్వగా... వంశీతేజను కిందకు దింపారు. కానీ అప్పటికే వంశీతేజ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వంశీతేజ వనపర్తి పట్టణంలో జరిగిన ఓ హత్యా ఘటనలో నిందితుడని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

ABOUT THE AUTHOR

...view details