తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మ.. నన్ను బతికించు అంటూ బాధితురాలి ఆవేదన... ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్లది. ఆ దంపతులకు అయిదుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేస్తూ ముగ్గురి పెళ్లిల్లు చేశారు. ఇంతలోనే ఆ మహిళ భర్త మరణించాడు. చిన్న కుమార్తెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆసుపత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలిసింది. కుమార్తె చికిత్స కోసం తల్లి అప్పులు చేసినప్పటికి వారి సమస్య తీరలేదు. తమ కూతురుని ఆదుకోవాలని కోరుతున్న ఆ కుటుంబంపై ప్రత్యేక కథనం.

A girl facing kidney problem in Wanaparthy District
A girl facing kidney problem in Wanaparthy District

By

Published : Nov 16, 2022, 8:08 PM IST

అమ్మ నన్ను బతికించు అంటూ బాధితురాలి ఆవేదన... ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

పిల్లలకు జ్వరం వస్తేనే తల్లులు తట్టుకోలేరు. అలాంటిది తన కూతురికి రెండు కిడ్నీలు పాడయ్యాయని వాటిని మారిస్తే తప్ప తన కూతురు బతకదని తెలిసి.. చేతిలో డబ్బులు లేనప్పుడు ఆ తల్లి ఆవేదన మాటల్లో చెప్పలేనిది. అలాంటి పరిస్థితే వనపర్తి జిల్లా కొత్తపేట మండలం అప్పరాల గ్రామంలో ఓ కుటుంబానికి వచ్చింది. బాల్‌రామ్‌, నాగమణెమ్మ అనే దంపతులకు అయిదుగురు ఆడపిల్లలు. కూలీపనులు చేస్తూ వచ్చిన డబ్బులతో ముగ్గురి ఆడపిల్లలకు వివాహం చేశారు.

మిగతా ఇద్దరిని పైచదువులు చదివిద్దామనుకునేలోపే.. నాగమణెమ్మ భర్త బాల్‌రామ్‌ చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు. ఇంతలోనే వారి 17 ఏళ్ల చిన్నకుమార్తె సరితకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని.. వాటిని మారిస్తేనే సరిత బతుకుందని చెప్పారు. చికిత్స కోసం చేతిలో డబ్బు లేని ఆ తల్లి కూతురి జీవితం కళ్లెదుటే ముగిసిపోతుందని ఆవేదన చెందుతోంది.

తన కూతురు ప్రాణాలు నిలబెట్టండి:ఇప్పటికే తన కూతురు సరిత కోసం ఆ తల్లి బంధువుల వద్ద 3 లక్షల రూపాయలు అప్పు చేసింది. అయినా అవి సరిపోవడం లేదు. సరిత అక్క మౌనిక చదువుకుంటేనే ఓ దుకాణంలో పనిచేస్తూ నెలనెలా ఇంటి ఖర్చులకు పంపుతోంది. కాని సరిత ఆసుపత్రి, మందుల ఖర్చులకి మాత్రం ఆ డబ్బులు సరిపోవడం లేదు. ప్రతినెల మందుల కోనుగోలుకు 10 వేల రూపాయలకు పైగా అవసరమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాన్ని ఆదుకోని.... తన కూతురుకి పునర్జన్మనివ్వాలని ఆ తల్లి కోరుతుంది. దాతలెవరైన తమకు తోచినంత సహాయం చేసి తన కూతురుని కాపాడాలని వేడుకుంటోంది.

"నేను పదోతరగతి వరకు చదువుకున్నాను. తొమ్మిది తరగతి చదువుతున్నప్పుడు జ్వరం మొదలైంది. అప్పుడు ఆసుపత్రికి వెళ్లితే టైఫాయిడ్, మలేరియా అని చెప్పారు. అప్పుడు మందులు వాడాను. కానీ ఒక రోజూ కాళ్లకు వాపులు, ఆయాసం వచ్చింది. వెంటనే కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే నాకు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. అప్పటి నుంచి డయాలసిస్​తో కాలం వెళ్లదీస్తున్నాను. ఎలాగైనా నన్ను బతికించండి." - సరిత బాధితురాలు

"మా చెల్లిని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. మొత్తం రూ.12లక్షలు అవుతాయని చెప్పారు. లక్ష రూపాయలు ఆరోగ్యశ్రీ పేరు మీద చికిత్స చేయించాం. ఆ తర్వాత మా చేతిలో నుంచి మరో రూ.3 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పటికైనా దాతలు ముందుకు వచ్చి మా చెల్లిని బతికించాలని కోరుతున్నాం." -ఇంద్రజ, సరిత అక్క

ఇవీ చదవండి:కేసీఆర్ కాళ్లు మొక్కిన డీహెచ్ శ్రీనివాసరావు.. సోషల్ మీడియాలో వైరల్

పోటీ నుంచి తప్పుకున్న ఆప్​ అభ్యర్థి.. భాజపా ఒత్తిడే కారణమని కేజ్రీవాల్ పార్టీ ఆరోపణ

ABOUT THE AUTHOR

...view details