వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పట్టణంలోని పలు రహదారులపై పర్యటించారు. మాస్కులు ధరించకుండా పెట్రోల్ పంపు వద్ద ఉన్నవారిని, రోడ్లపై తిరిగే వాహనచోదకులను అడ్డుకున్నారు. లాక్డౌన్ వేళ గుంపులుగా ఉండేవారిని గుర్తించి కలెక్టర్ వారితో గుంజీలు తీయించారు. ఇకపై ఎవరూ కూడా మాస్కులు లేకుండా బయటకు రావద్దని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘన..గుంజీలు తీయించిన కలెక్టర్
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై నిర్లక్ష్యంగా తిరిగే వారితో గుంజీలు తీయించారు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష. రూ. 1500 తీసుకునేందుకు బ్యాంకుల వద్దకు వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘన..గుంజీలు తీయించిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ. 1500 తీసుకునేందుకు బ్యాంకుల వద్దకు వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా బ్యాంకు లోపలికి ఎవరిని అనుమతించరాదని అధికారులకు తెలిపారు. వనపర్తి పట్టణంలో మార్కెట్ యార్డులో కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. నిబంధనలు పాటించాలని విక్రయదారులను కోరారు.
ఇదీ చూడండి :బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..
Last Updated : Apr 16, 2020, 8:19 PM IST