తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటిల్లిపాదిని బలితీసుకున్న మద్యం - CRIME NEWS IN WANAPARTHI

అతని వ్యసనమే... ఆ కుటుంబంలో విషాదఛాయలు నిపింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబసభ్యులను విగతజీవులుగా మార్చేసింది. భార్యా, కూతురిని చంపాలని తలచి చేసిన దుర్మార్గపు ఆలోచనలో వారితో పాటు ఆ వ్యక్తీ కాలిపోయిన దారుణ ఘటన వనపర్తి జిల్లా అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది.

3 FAMILY MEMBERS DIED IN AYYAVARIPALLE
3 FAMILY MEMBERS DIED IN AYYAVARIPALLE

By

Published : Jan 4, 2020, 2:13 PM IST

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. జయన్న చేసిన ఓ మూర్ఖపు ఆలోచనకు వారి కుంటుబం మొత్తం బలైంది. మద్యానికి బానిసైన జయన్నను... ఆ అలవాటు మానుకొమ్మని చెప్పిన భార్య వరలక్ష్మిపైనా కక్ష పెంచుకున్నాడు. అమ్మ చెప్పింది నిజమేనని మద్దతు నిలిచిన కూతురు గాయత్రిపై కోపం పెంచుకున్నాడు. మద్యానికి బానిస కావటమే కాకుండా... జులాయిగా తిరిగితే కుటుంబ పోషణ ఎలా అని నిలదిసిన భార్యాకూతురును కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.

నూతన సంవత్సరం మొదటి రోజునే...

జనవరి 1న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య, కుమార్తెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో జయన్నకు సైతం మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని స్థానికులు కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి.. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జనవరి 2న కుమార్తె, ఆ తర్వాత జయన్న మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతన్న వరలక్ష్మి కూడా శుక్రవారం మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇంటిల్లిపాదిని బలితీసుకున్న మద్యం

ఇవీ చూడండి: రిజర్వేషన్ల ఖరారుకు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details