ఇళ్లు, కాలనీల్లోకి చేరే పాములను ఒడుపుగా పట్టి అడవిలో వదిలిపెట్టే (Snake Catcher) వనపర్తి హోంగార్డు కృష్ణసాగర్ నేతృత్వంలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 13 పాములను (13 Snake Catch) పట్టుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి, జగత్‌పల్లిలో ఒక్కొక్కటి చొప్పున, మోజర్లలో రెండు పాములను పట్టారు. వనపర్తి చుట్టుపక్కల కాలనీల్లో మరికొన్నింటిని బంధించారు.
Snake Catcher: ఒకేరోజు 13 పాముల పట్టివేత.. వాటిని ఏం చేశారంటే..? - 13 snakes were caught in one day In Wanaparthy district
పాము (Snake )చూడగానే మనం భయపడిపోతాం.. దాన్ని పట్టుకోవాలంటే.. సాహసమనే చెప్పాలి. ఓ వ్యక్తి ఒకే రోజు ఏకంగా 13 పాములను (13 Snake Catch) పట్టుకున్నాడు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
Snake Catcher
వీటిలో అయిదు నాగుపాములు, అయిదు జెర్రిపోతులు, నీటిపాము, బ్రాండ్ రైజర్, నూనెకట్ల పాము ఉన్నాయని, వాటిని తిరుమలాయగుట్ట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని కృష్ణసాగర్, సాగర్ స్నేక్ సొసైటీ సభ్యులు శివాజీ, అనిరుధ్, బాలరాజు, అవినాష్ తెలిపారు.
ఇదీ చూడండి:గాజుపాత్రలో రూ.12 కోట్ల విలువైన పాము విషం.. ఎక్కడిది?