వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్లు అధ్వానంగా ఉండటంచే కాలుష్యం తీవ్రత పెరిగిపోతుందని యువత ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలకు అతీతంగా యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన చేశారు. స్థానికంగా రోడ్లు అధ్వానంగా మారాయని.. ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆర్బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని యువకులు అన్నారు. ఈ తరుణంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.