వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం గట్టెపల్లి తండాలో సంగీత అనే వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ... మృతురాలి బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ధరూర్ మండలం రాంపూర్‌కు చెందిన సంగీత గట్టెపల్లికి చెందిన శ్రీనివాస్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఒక బాబు, పాప కూడా ఉన్నారు. తర్వాత కొంత కాలానికి వరకట్నం తేవాలంటూ వేధింపులు ప్రారంభమైనట్లు మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానంటే ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాస్ బెదిరించినట్లు తెలిపారు. మంగళవారం మరోసారి గొడవ పడి సంగీతను హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మ'హత్య'!
ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో వివాదం పెద్దదైంది. చివరకు భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా గట్టెపల్లి తండాలో చోటుచేసుకుంది.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మ'హత్య'!