తెలంగాణ

telangana

ETV Bharat / state

మోసం చేశాడని భర్త ఇంటి ముందే భార్య ఆందోళన

ప్రేమించాడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత భార్యను వేధించి వదిలేశాడు. నిస్సహాయురాలైన ఆమె... భర్త ఇంటి ముందే ఆందోళనకు దిగింది. వికారాబాద్​లోని కోటపల్లిలో ఈ ఘటన జరిగింది.

భార్య ఆందోళన

By

Published : Apr 12, 2019, 8:32 PM IST

వికారాబాద్​ జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో భర్త మోసం చేశాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందే భార్య ఆందోళనకు దిగింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్​గౌడ్​ అదే ప్రాంతానికి చెందిన అశ్వినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరం పాటు బాగానే ఉన్నా తర్వాత భార్యను పట్టించుకోవడం మానేశాడు. మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే కౌన్సిలింగ్​ ఇచ్చినా మార్పు రాలేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఇవాళ ఆమె భర్త ఇంటి ముందు నిరసన తెలిపింది.
తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదలేది లేదని భీష్మించుకు కూర్చుంది. తన సోదరికి పోలీసులు న్యాయం చేయాలని బాధితురాలి సోదరుడు కోరుతున్నాడు.

భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న భార్య

ABOUT THE AUTHOR

...view details