వికారాబాద్ జిల్లా పరిగి లోని కొడంగల్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు, జాట్ జిల్లా అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, సర్పంచ్ నర్సింహ ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిర్మించాలంటే యువత ముందుకు రావాలని వక్తులు సూచించారు. అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు పూర్తిగా నిలిచిపోయినప్పుడే గాంధీజీ కి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ శ్రీనివాస్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వివిధ పార్టీల నేతలు, యువకులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ - పరిగిలో వాక్ ఫర్ నేషన్
గాంధీజీ ఆశయ సాధన కోసం జాట్ సంస్థ 'వాక్ ఫర్ నేషన్' నిర్వహించింది. సుమారు వేయి మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
![గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5419298-410-5419298-1576690671589.jpg)
గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ
గాంధీజీ ఆశయ సాధన కోసం 'వాక్ ఫర్ నేషన్' ర్యాలీ
ఇవీ చూడండి: 'మతితప్పి పోలీసులపై ఆరోపణలు చేశాం.. క్షమించండి'