తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​కు వరుస కడుతున్న అగ్రనేతలు - అగ్రనేతలు

లోక్​సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు జాతీయ నేతలు వికారాబాద్​ జిల్లాను ఎంచుకున్నారు. ఈనెల 8న యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ వికారాబాద్​ జిల్లా మన్నెగూడకు రానున్నారు. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈనెల 5న వికారాబాద్​లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

వికారాబాద్​కు వరుస కడుతున్న అగ్రనేతలు

By

Published : Apr 3, 2019, 7:34 AM IST

వికారాబాద్​కు వరుస కడుతున్న అగ్రనేతలు
త్వరలో వికారాబాద్​ జిల్లాకు అగ్రనేతల తాకిడి పెరగనుంది. ప్రచారానికి, బహిరంగ సభలకు వివిధ పార్టీల అగ్రనేతలు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 8వ తేదిన కాంగ్రెస్​ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ వికారాబాద్​ వస్తున్నారు. మన్నెగూడలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్​ వికారాబాద్​ పట్టణానికి సమీపంలోని కొత్రేపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు. భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈ నెల 5 న వికారాబాద్​కు రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details