భార్యపై అనుమానంతో ఓ భర్త అర్ధరాత్రి అతి కిరాతకంగా భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన వికారాబాద్ మోతీబాగ్లో కలకలం రేపింది. ఇనుప కడ్డీతో తలపై బాది హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు స్థానిక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
వికారాబాద్లో దారుణం... భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త - murder
వికారాబాద్ మోతీబాగ్లో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త అర్ధరాత్రి అతి క్రూరంగా ప్రవర్తించి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.
హైదరాబాద్ లింగంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్, చాందిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వికారాబాద్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ నివసిస్తున్నారు. ఇటీవల భార్య చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ కుమార్ తరుచూ గొడవలు పడుతుండేవాడు. నిన్న అర్ధరాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో.... కోపోద్రిక్తుడైన ప్రవీణ్ కుమార్... ఇంట్లో ఉన్న ఇనుప కడ్డీతో భార్య చాందిని, కొడుకు అయాన్, కూతురు ఏంజిల్ను తలపై బాది హత్య చేశాడు . అనంతరం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.