Vikarabad Municipality news today: వికారాబాద్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ నిఖిల.. మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో అక్కడి అర్బన్ నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలను చూశారు. మొక్కలు ఏపుగా పెరిగే వరకు ఏం చేస్తున్నారని.. వాటిని హరితహారంలో భాగంగా ఎందుకు నాటలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటాలని పురపాలక సిబ్బందిని ఆదేశించారు.
Vikarabad district collector Nikhila: కలెక్టర్ మొక్కలు నాటాలని చెబితే.. అక్కడి పురపాలక సిబ్బంది మాత్రం దీనికి భిన్నంగా చేశారు. నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలన్నింటిని పీకేసి మూసీ నదిలో పడవేశారు. అక్కడి మట్టిని చదును చేశారు.