తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్ జిల్లాలో.. కారు జోరు.. - Telangana Muncipall Elections news Breaking]

రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్​ ఎన్నికల్లో కారు హవా కొనసాగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ దళం కైవసం చేసుసుకుంది. ఛైర్మన్​, వైస్ ఛైర్మన్​ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది.

Vikarabad district ..car Josh..
వికారాబాద్ జిల్లాలో.. కారు జోరు..

By

Published : Jan 27, 2020, 6:11 PM IST

వికారాబాద్ జిల్లాలో కారు దూసుకెళ్లింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లాలోని ఛైర్మన్​, వైస్ ఛైర్మన్​ స్థానాలన్నింటిని తెరాస కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. వికారాబాద్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాడ్వాయిలలో కారు స్పీడుకు ఇతర పార్టీలు కళ్లెం వేయలేకపోయాయి.


వికారాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్​గా చిగుళ్లపల్లి మంజుల, వైస్ ఛైర్మన్​గా శంషాద్ బేగం ఎన్నికయ్యారు. పరిగి మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని ముకుంద అశోక్, వైస్ ఛైర్మన్ పీఠాన్ని ప్రసన్నలక్ష్మి కైవసం చేసుకున్నారు. తాండూరు మున్సిపల్​ ఛైర్మన్​గా తాటికొండ స్వప్న, వైస్ ఛైర్మన్​గా దీప ఎన్నికయ్యారు. కొడంగల్ మున్సిపల్​ ఛైర్మన్​గా జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మన్​గా ఉషారాణిలు ఎన్నికయ్యారు. జిల్లా వ్యాప్తంగా తెరాస జయకేతనం ఎగరవేసింది.

వికారాబాద్ - తెరాస క్లీన్ స్వీప్

  1. వికారాబాద్ మునిసిపల్ ఛైర్మన్ చిగిల్లపల్లి మంజుల - వైస్ ఛైర్మన్ శంషాద్ బేగం
  2. పరిగి మునిసిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్ - వైస్ ఛైర్మన్ ప్రసన్న లక్ష్మీ
  3. తాండూరు మునిసిపల్ ఛైర్మన్ తాటికొండ స్వప్న - వైస్ ఛైర్మన్ దీప
  4. కొడంగల్ మునిసిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి - వైస్ ఛైర్మన్ ఉషారాణి

ABOUT THE AUTHOR

...view details